ఫిడే వరల్డ్​ చెస్​ చాంపియన్​ గుకేశ్​

ఫిడే వరల్డ్​ చెస్​ చాంపియన్​ గుకేశ్​

సింగపూర్​లో జరిగిన ఫిడే వరల్డ్​ చెస్ చాంపియన్​ షిప్​లో చాంపియన్​గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్​ అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విశ్వనాథన్​ ఆనంద్​ (2000, 2007, 2008, 2010, 2012) వరల్డ్​ చెస్​ చాంపియన్​షిప్​లో విజేతగా నిలిచాడు.

ఈ ఘనత సాధించిన రెండో భారత్​ ప్లేయర్​గా దొమ్మరాజు గుకేశ్​ నిలిచాడు. 22ఏండ్ల వయస్సు(1985)లో ప్రపంచ చాంపియన్​గా నిలిచిన రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్​ పేరిట ఉన్న నాలుగు దశాబ్దాల రికార్డును గుకేశ్​ తిరగరాశాడు. 

ఆసియా నుంచి ముగ్గురు

  • విశ్వనాథన్​ ఆనంద్​ (భారత్​) – ఐదుసార్లు ప్రపంచ చెస్​ చాంపియన్​
  • డింగ్​ లిరెన్​ (చైనా)– ప్రపంచ చెస్ చాంపియన్​షిప్​ – 2023
  • గుకేశ్​ దొమ్మరాజు (భారత్​) 2024లో విజయం సాధించి అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.