
సింగపూర్ : ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ మధ్య సోమవారం మొదలయ్యే వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ మొదలవనుంది. ఈ పోరులో గుకేశ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే, ఎప్పుడు ఎలా ఆడుతాడో తెలియని లిరెన్‌ను తక్కువ అంచనా వేయలేం.
తొలి రౌండ్‌లో గుకేశ్ తెల్లపావులతో ఆడనున్నాడు. డిసెంబర్ 12 వరకు జరిగే ఈ టోర్నీలో 14 రౌండ్లు ఉంటాయి. మొదటగా 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ చాంపియన్‌గా నిలుస్తాడు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమాన పాయింట్లతో ఉంటే టై బ్రేక్స్‌తో విజేతను తేలుస్తారు.