
సింగపూర్: వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్ డ్రాగా ముగిసింది. తొలి గేమ్‌లో ఓడిన గుకేశ్ ఈ పోరులో నల్లపావులతో మెరుగ్గా ఆడాడు.
23 ఎత్తుల వద్ద ఇరువురు ప్లేయర్లు డ్రాకు అంగీకరించడంతో చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం లిరెన్ 1.5 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. బుధవారం మూడో రౌండ్ జరుగుతుంది.