ఆస్తానా(కజకిస్తాన్): చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్, రష్యా జీఎం ఇయాన్ నెపోమ్నియాచి మధ్య వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఫైట్ టై బ్రేక్స్‌కు చేరుకుంది. నిర్ణీత 14 క్లాసికల్ రౌండ్లలో ఇరువురు గ్రాండ్ మాస్టర్లు చెరో ఏడు పాయింట్లతో సమంగా నిలిచారు. శనివారం జరిగిన చివరి క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది.
తెల్లపావులతో ఆడిన లిరెన్ 14వ ఎత్తులో తప్పిదం చేయడంతో ఇయాన్ గేమ్ గెలిచి వరల్డ్ చాంపియన్ దిశగా ముందుకెళ్లాడు. కానీ, అద్భుతంగా పుంజుకున్న లిరెన్ 90వ ఎత్తుల్లో గేమ్‌ను డ్రాగా ముగించి ఊపిరి పీల్చుకున్నాడు. విన్నర్‌ను తేల్చేందుకు ఆదివారం నాలుగు ర్యాపిడ్ గేమ్స్ నిర్వహిస్తారు. అందులోనూ ఫలితం తేలకపోతే బ్లిట్జ్ గేమ్ ఆడిస్తారు. టైటిల్ నెగ్గిన ప్లేయర్‌కు దాదాపు రూ.10 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. సెకండ్ ప్లేయర్‌కు 8 కోట్లు దక్కుతుంది.