వరల్డ్ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌: ఇంకా సమంగానే.. గుకేశ్‌‌‌‌–లిరెన్‌‌‌‌ 13వ గేమ్ డ్రా

వరల్డ్ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌: ఇంకా సమంగానే.. గుకేశ్‌‌‌‌–లిరెన్‌‌‌‌ 13వ గేమ్ డ్రా
  • గుకేశ్‌‌‌‌–లిరెన్‌‌‌‌ 13వ గేమ్ డ్రా

సింగపూర్‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌.. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డింగ్‌‌‌‌ లిరెన్‌‌‌‌ మధ్య వరల్డ్ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోరు ఆఖరి గేమ్‌‌‌‌కు చేరుకుంది.  బుధవారం జరిగిన 13వ రౌండ్ గేమ్‌‌‌‌ కూడా 68 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో ఇద్దరు ప్లేయర్లు చెరో ఆరున్నర పాయింట్లతో నిలిచారు. గుకేశ్‌‌‌‌ కింగ్‌‌‌‌ పాన్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌తో ఆట మొదలుపెడితే.. లిరెన్‌‌‌‌ తనకు ఇష్టమైన  ఫ్రెంచ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌తో ముందుకొచ్చాడు. అయినప్పటికీ చైనా ప్లేయర్‌‌‌‌ ఎత్తులు వేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. 

తెల్ల పావులతో ఆడిన గుకేశ్ గేమ్‌‌‌‌ మధ్యలో  కాస్త పైచేయి సాధించినా చివర్లో లిరెన్‌‌‌‌ అడ్డుకట్ట వేశాడు. దాంతో, గుకేశ్‌‌‌‌ డ్రా చేసుకోవడమే కాస్త ఇబ్బందిగా మారింది. గురువారం చివరి, 14వ రౌండ్‌‌‌‌లో లిరెన్‌‌‌‌ తెల్లపావులతో ఆడటం తనకు ప్లస్ పాయింట్ కానుంది. ఆఖరి రౌండ్‌‌‌‌లో నెగ్గిన వాళ్లకు చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ దక్కుతుంది. ఒకవేళ డ్రా అయితే శుక్రవారం టై బ్రేక్‌‌‌‌లో విన్నర్‌‌‌‌ను తేలుస్తారు.