- 11వ రౌండ్లో లిరెన్‌పై విక్టరీ
సింగపూర్: ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ యంగెస్ట్ వరల్డ్ చెస్ చాంపియన్ అయ్యేందుకు కీలక అడుగు వేశాడు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మరో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన 11వ రౌండ్లో గుకేశ్ 29 ఎత్తుల వద్ద డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)పై నెగ్గాడు.
తెల్లపావులతో ఆడిన గుకేశ్ నైట్ మూవ్ స్ట్రాటజీతో ముందుకెళ్లగా, లిరెన్ బెనోని ఓపెనింగ్‌తో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఐదు ఎత్తుల తర్వాత ఇండియన్ ప్లేయర్ గంటపాటు ఆధిక్యంలో కొనసాగాడు. చివర్లో ఓ పావును త్యాగం చేసిన గుకేశ్ ఈజీగా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ రౌండ్ తర్వాత గుకేశ్ 6, లిరెన్ 5 పాయింట్లతో కొనసాగుతున్నారు. మరో మూడు రౌండ్ గేమ్స్ మిగిలి ఉన్నాయి.