
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌కు సింగపూర్ ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ ఆతిథ్యం కోసం ఢిల్లీ, చెన్నై చివరివరకు పోరాడాయి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 మధ్య ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లీరెన్ (చైనా)తో తలపడనున్నాడు. ప్రైజ్‌మనీ దాదాపు రూ. 20 కోట్లు ఉండనుంది. ‘బిడ్స్‌ను చూసిన తర్వాత ఆయా వేదికలను డైరెక్ట్‌గా పరిశీలించాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగపూర్‌ను ఫైనల్ చేశాం’ అని ఫిడే పేర్కొంది. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ గెలవడంతో గుకేశ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.