చాక్లెట్స్ అంటే చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ఇష్టపడతారు. పుట్టినరోజు నాడు చాక్లెట్ల్స్ పంచుతారు.. ఆనందకరమైన విషయాలు పంచుకునేటపుడు చాక్లెట్స్‌తో నోరు తీపి చేసుకుంటారు. జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం . అసలు దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం చాక్లెట్ ప్రియులందరికీ ప్రత్యేకమైన రోజు. ప్రతి సంవత్సరం,..ఇది జూలై 7 న జరుపుకుంటారు. ఇది శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆనందాన్ని కలిగించిన రుచికరమైన ట్రీట్ గౌరవార్థం జరుపుకునే వార్షిక కార్యక్రమం. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం నాడు, ప్రజలు తమకు ఇష్టమైన చాక్లెట్‌లను తినడం .... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త రకాల చాక్లెట్ల ద్వారా స్వీట్ ట్రీట్‌ను జరుపుకుంటారు.
అసలు చాక్లెట్లు ఇష్టపడని వారుంటారా?
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం రోజున చాక్లెట్ ప్రియులంతా రకరకాల చాక్లెట్లు పంచుకోవడం... రుచి చూడటంలో.. తయారు చేయడంలో బిజీ బిజీగా గడుపుతారు. అనేక సందర్భాల్లో మన ప్రియమైన వారికి మంచి వార్తలు చెప్పడానికి కూడా చాక్లెట్ ఇచ్చి చెబుతాం. చాక్లెట్‌కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. రకరకాల ఫ్లేవర్లలో దొరికే చాక్లెట్లు అందరిని ఆకర్షిస్తాయి.
చాక్లెట్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
3వేల సంవత్సరాల క్రితం మెక్సికోలోని అజ్టెక్ తెగ వారు మొదటిసారిగా చాక్లెట్‌ను తయారు చేశారు. వారు చేదు పానీయాన్ని సృష్టించడానికి కాకో చెట్టు నుండి కోకో గింజలను ఉపయోగించారు. యూరోపియన్లు మిఠాయి బార్లను తయారు చేయడానికి చక్కెర , ఇతర పదార్ధాలతో కలపడం ప్రారంభించే వరకు చాక్లెట్ ఘన రూపంలో తయారు కాలేదు.
1550 లో యూరప్‌లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం మొదట జరుపుకున్నారట. అప్పట్లో మెక్సికో, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే చాక్లెట్ అందుబాటులో ఉండేదట. అయితే ఈ వేడుకను యూరోపియన్ ఖండానికి తీసుకురావాలని కోరుకున్నారట అక్కడి వారు. 1519 లో హెర్నాన్ కోర్టెస్‌కు అజెక్ట్ చక్రవర్తి Xocolatl అనే చాక్లెట్‌తో తయారు చేసిన పానీయాన్ని తయారు చేసాడట. కోర్టెస్ దీనిని యూరప్‌కు తీసుకువచ్చాడు. చక్కెర, వెనీలా, దాల్చిన చెక్కతో దీనిని తీయగా తయారు చేశాడట. 1800 లో ఘన అంటే గట్టిగా ఉండే చాక్లెట్లు జనం ఇష్టపడటం మొదలుపెట్టారు. అలా వచ్చిన చాక్లెట్లు ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టంగా మారిపోయాయి.
చాక్లెట్ దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?
*చాక్లెట్ బార్, చాక్లెట్ డెజర్ట్ లేదా హాట్ చాక్లెట్ డ్రింక్‌లను టేస్ట్ చేయండి..
* మీకు బాగా ప్రియమైన వారితో ఆస్వాదించండి.
*ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో వంటగదిలోకి చేరిపోండి. చాక్లెట్ చిప్ కుకీలు లేదా బ్రౌనీ బైట్స్‌ని తయారు చేయండి. అందరు కలిసి రుచి చూస్తే కలిగే ఆనందమే వేరు.
*చాక్లెట్లు తింటూ... చాక్లెట్ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్, ఫారెస్ట్ గంప్ వంటి చాక్లెట్ రిలేటెడ్ సినిమాలను చూడండి.
*మీరు పని చేసే చోట చాక్లెట్లు పంచుకోండి. ఇలా చేయడం వల్ల కొలిగ్స్ మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొని మంచి అనుబంధాలు ఏర్పడతాయి.
ప్రపంచ చాక్లెట్ డే గురించి ఇతర ముఖ్యమైన విషయాలు:
* అంతర్జాతీయ కోకో ఆర్గనైజేషన్ జూలై 7ని ప్రపంచ చాక్లెట్ దినోత్సవంగా ప్రకటించినప్పుడు 2009లో అధికారికంగా జరుపుకున్నారు.
* స్విస్ ప్రతి సంవత్సరం సగటున 11 పౌండ్ల వినియోగంతో తలసరి చాక్లెట్‌ను ఎక్కువగా వినియోగిస్తుంది
* ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ బార్ 12,000 పౌండ్ల బరువుతో ఇటలీలో తయారు చేయబడింది
* యునైటెడ్ స్టేట్స్ చాక్లెట్ విక్రయాల ద్వారా సంవత్సరానికి 20 బిలియన్ల డాలర్ల ఆదాయంతో అన్ని దేశాలలో అగ్రగామిగా ఉంది
* డార్క్ చాక్లెట్‌లో ఇతర రకాల ఆహారం కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
* ఒక కోకో చెట్టు ప్రతి సంవత్సరం 300 బార్‌ల చాక్లెట్‌లకు సరిపడా బీన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది
So చాక్లెట్ ప్రియులందరికీ హ్యాపీ వరల్డ్ చాక్లెట్ డే.