వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం బుక్‌మైషోను టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రకటించింది. అయితే ఐసీసీ పార్ట్నర్ మాస్టర్ కార్డ్ కస్టమర్లు 24 గంటల ముందే టికెట్లు కొనుగోలు చేసేలా ప్రీ-సేల్ అందుబాటులోకి తెచ్చింది.
సెప్టెంబర్ 29 నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. ప్రధాన మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుండి మొదలుకానున్నాయి. మొత్తం 58 మ్యాచ్‌లు కాగా, ఇందులో 10 వార్మప్ మ్యాచ్‌లు ఉన్నాయి.
మాస్టర్ కార్డ్ ప్రీ సేల్ షెడ్యూల్
- ఆగస్ట్ 24 (సాయంత్రం 6 గంటల నుండి): వార్మప్ గేమ్‌లు, ఇండియా మ్యాచ్‌లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌ల టికెట్లు
- ఆగస్ట్ 29 (సాయంత్రం 6 గంటల నుండి): వార్మప్ గేమ్‌లు మినహా అన్ని ఇండియా మ్యాచ్‌ల టికెట్లు
- సెప్టెంబర్ 14 (సాయంత్రం 6 గంటల నుండి): సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు
ఇతర వినియోగదారులందరికీ టికెట్ల విక్రయాలు
- ఆగస్ట్ 25 (రాత్రి 8 గంటల నుండి): నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు మరియు అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
- ఆగస్టు 30(రాత్రి 8 గంటల నుండి): గౌహతి మరియు త్రివేండ్రంలో భారత్ మ్యాచ్‌లు
- ఆగస్టు 31 (రాత్రి 8 గంటల నుండి): చెన్నై, ఢిల్లీ మరియు పూణేలలో భారత్ మ్యాచ్‌లు
- సెప్టెంబర్ 1 (రాత్రి 8 గంటల నుండి): ధర్మశాల, లక్నో మరియు ముంబైలలో భారత్ మ్యాచ్‌లు
- సెప్టెంబర్ 2 (రాత్రి 8 గంటల నుండి): బెంగళూరు మరియు కోల్‌కతాలో భారత్ మ్యాచ్‌లు
- సెప్టెంబర్ 3 (రాత్రి 8 గంటల నుండి): అహ్మదాబాద్‌లో భారత్ మ్యాచ్
- సెప్టెంబర్ 15 (రాత్రి 8 గంటల నుండి): సెమీ-ఫైనల్ మరియు ఫైనల్