ప్రస్తుతం వరల్డ్ కప్ 2023 సందర్భంగా క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు అంతా టీవీలకు అతుక్కుపోయారు. ఎక్కడ చూసినా డిస్కషన్ వరల్డ్ కప్ పైనే. వరల్డ్ కప్ 2023 కప్ కోసం పోటీ పడుతున్న జట్ల బలాబలాలు, ఫేమస్ క్రికెటర్లపై అంచనాలు. ముఖ్యంగా ఫేవరేట్ టీంల మధ్య మ్యాచ్ లు చూసేందుకు యూత్, క్రికెట్ అభిమానులు పెద్ద స్క్రీన్ ల ముందు గడుపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో పెద్దపెద్ద స్క్రీన్లతో ఆండ్రాయిడ్ టీవీల్లో క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ అభిమాన క్రికెటర్ల ఆటను ఎంజాయ్ చేస్తున్నారు.. అంతేకాదు ప్రత్యేకంగా క్రికెట్ కోసమే పెద్ద స్ర్కీన్లను కొనుగోలు చేసే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు.
అసలే క్రికెట్ వరల్డ్ కప్.. నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది.. ఈ టైంలోనే పండుగల సీజన్.. ఇంకేముందు దేశవ్యాప్తంగా టీవీల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. Xiaomi, LG, Sony, Panasonic వంటి బ్రాండ్ల కొనుగోలుకు జనం క్యూ కడుతున్నారు.. దీంతో ఈ ప్రాడక్టులకు భారీ డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్ల డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి చేయలేనంతగా..
దేశవ్యాప్తంగా అన్ని ఆన్ లైన్ రిటైల్ కంపెనీలు తమ పండగ అమ్మకాలను ఇప్పటికే ప్రారంభించాయి. ఎల్ఈడీ, ఆండ్రాయిడ్ బిగ్ స్ర్కీన్ టీవీ భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లతో పాటు రకరకాల ఆఫర్లను కస్టమర్లకు అందిస్తుండటంతో భారీ ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి.
పండుగలు, క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ఈ ఏడాది ఈ సీజన్ లోసేల్స్ పెరిగాయని LG ఇండియా బిజినెస్ హెడ్ చెపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 55 అంగుళాలు , అంతకంటే పెద్ద టీవీల అమ్మకాలు 2 నుంచి2.5 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
క్రికెట్ ప్రపంచ కప్‌తో 75 Inches, 85 Inches స్క్రీన్‌లతో సహా పెద్ద స్క్రీన్ మోడళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సోనీ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మీరు కొత్త టీవీని కొనుగోలు చేయాలనుకునే వారు OLED, QLED , IPS LCD ప్యానెల్‌ల వంటి విభిన్న డిస్‌ప్లే టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి.. చెక్ చేసుకొని కొనుగోలు చేయొచ్చంటున్నారు సోనీ కంపెనీవర్గాలు.
ఉదాహరణకు OLED ప్యానెల్స్ మంచివి.. అయితే అవి మితిమీరిన ప్రకాశవంతమైన గదులకు తగినవి కాకపోవచ్చు.. మీకు అత్యంత కాంట్రాస్ట్-రిచ్ ఇమేజ్ కావాలంటే OLEDలు మాత్రమే అర్ధవంతంగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకొని తీసుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి.