వరల్డ్ కప్ ఫైనల్.. వరల్డ్ కప్ ఫైనల్.. ఏ గల్లీకెళ్లినా, ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా ఇదే జపం. ఆ ఆసక్తికర పోరు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఆదివారం(నవంబర్ 19)అహ్మదాబాద్ గడ్డపై లక్షా 30 వేల మంది ప్రేక్షకుల నడుమ టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ తరుణంలో భారత క్రికెటర్ల అదృష్టదేవతలు ఒక్కొక్కరిగా అహ్మదాబాద్ చేరుకుంటున్నారు.
ఇండియా- ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, మెన్ ఇన్ బ్లూకు మద్దతుగా భారత క్రికెటర్ల సతీమణులు, ప్రియురాళ్లు అహ్మదాబాద్ విచ్చేశారు. విరాట్ కోహ్లి భార్య సతీమణి అనుష్క శర్మ, భారత కెప్టెన్ రోహిత్ భార్య రితికా సజ్దే, భారత వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ బెటర్ హాఫ్ అథియా శెట్టి, భారత యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ ప్రియురాలు(పుకార్లు) సారా టెండూల్కర్ ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి ఫొటోలే దర్శనమిస్తున్నాయి.
Anushka Sharma and Sara Tendulkar have arrived at Ahmedabad for the big finale ?#CricketTwitter #India #CWC23 pic.twitter.com/LDwGSrfZe9
— InsideSport (@InsideSportIND) November 18, 2023
అందరి ద్రుష్టి సారాపైనే
భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అందరి ద్రుష్టి నెలకొంది. ఆ అందాల ముద్దుగుమ్మ కనిపిస్తే గిల్ మరింత ఉత్సాహంగా ఆడతాడని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సారా పలు ఇండియా మ్యాచ్‌లకు హాజరవుతోంది. అక్టోబర్ 19న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో కనిపించిన సారా, వాంఖడే వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు కూడా హాజరైంది. ఆ మ్యాచ్‌లో గిల్‌ను(66 బంతుల్లో 80 పరుగులు) ప్రశంసిస్తూ మీడియా కంటపడింది.
Shubman Gill play only Sara Tendulkar came in stadium.
— Rohirat?? (@cricketfan_2002) November 15, 2023
So Sara Sachin Tendulkar came in Ahmedabad stadium final also.#indvsnz #ShubmanGill #Hitman #RohitSharma? #ViratKohli #Semifinals @i_saratendulkar pic.twitter.com/BZXzc7p5uG
Moment of The Day ?pic.twitter.com/okjSJcarwW
— Sara Tendulkar (@SaraTendulkar__) November 15, 2023