భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీమిండియా వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. ఈ సేవలు మంగళవారం(ఆగస్టు 29) సాయంత్రం 6 గంటల నుండి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక్కరు గరిష్ఠంగా రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం మాస్టర్ కార్డ్ వినియోగదారులు మాత్రమే. ఇతరులు బుధవారం(ఆగస్టు 30) నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
వాస్తవానికి టీమిండియా మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు ఆగష్టు 30 నుంచి ప్రారంభం కావాలి. అయితే బీసీసీఐ.. ఐసీసీ పార్ట్నర్ మాస్టర్ కార్డ్ కస్టమర్లు 24 గంటల ముందే టికెట్లు కొనుగోలు చేసేలా ప్రీ-సేల్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మాస్టర్ కార్డ్ కస్టమర్లు.. నేటి(ఆగస్టు 29) సాయంత్రం నుండే టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
టీమిండియా వార్మప్ మ్యాచ్‌ల టికెట్లు
టీమిండియా వార్మప్ మ్యాచ్‌ల టికెట్లు బుధవారం(ఆగస్టు 30) రాత్రి 8:00 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. భారత జట్టు.. వార్మప్ గేమ్‌లలో ఇంగ్లాండ్(సెప్టెంబరు 30), నెదర్లాండ్స్(అక్టోబర్ 3)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లు గౌహతి, తిరువనంతపురం వేదికగా జరగనున్నాయి.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- టికెట్లు కావాల్సిన వారు ముందుగా ఈ https://in.bookmyshow.com/sports/india-icc-mens-cwc-2023/ET00367219 లింక్ పై క్లిక్ చేయండి.
- అనంతరం మీరు ఏ నగరంలో అయితే మ్యాచ్ చూడాలనుకుంటున్నారో ఆ నగరాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు నచ్చిన మ్యాచ్ ను ఎంపిక చేయండి.
- ఆపై మీ వివరాలు నమోదు చేసి.. టికెట్ కంఫర్మ్ చేసుకోండి.
గమనిక: రద్దీ దృష్ట్యా కాస్త సమయం పడుతుంది. తిరిగి వెనకకు మర్లకుండా.. కాస్త సహనం పాటించండి. మీ సమయం వచ్చినప్పుడు టికెట్ల విక్రయాల పేజీ ఓపెన్ అవుతుంది.