జోర్‌‌‌‌‌‌‌‌దార్‌‌‌‌‌‌‌‌ కివీస్‌‌‌‌‌‌‌‌

జోర్‌‌‌‌‌‌‌‌దార్‌‌‌‌‌‌‌‌ కివీస్‌‌‌‌‌‌‌‌
  • జోర్‌‌‌‌‌‌‌‌దార్‌‌‌‌‌‌‌‌ కివీస్‌‌‌‌‌‌‌‌
  • 149 రన్స్‌‌‌‌‌‌‌‌తో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌
  • వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో వరుసగా నాలుగో విజయం సొంతం

చెన్నై:  వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ జోరు కొనసాగుతోంది.  డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి టోర్నీలో వరుసగా నాలుగో విక్టరీ సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి చెపాక్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటిన కివీస్‌‌‌‌‌‌‌‌ 149 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది.  టోర్నీలో ఒక్క ఓటమి కూడా  లేకుండా పాయింట్స్‌‌‌‌‌‌‌‌ టేబుల్లో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేసింది. స్పిన్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌పై  ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన కివీస్‌‌‌‌‌‌‌‌ నిర్ణీత 50 ఓవర్లలో 288/6 స్కోరు చేసింది.  

గ్లెన్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (80 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71),  స్టాండిన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ టామ్‌‌‌‌‌‌‌‌ లాథమ్‌‌‌‌‌‌‌‌ (74 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (64 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) ఫిఫ్టీలతో రాణించారు. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (20) ఏడో ఓవర్లోనే ఔటైనా.. రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (32)తో విల్‌‌‌‌‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 79 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. కానీ,  ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌ (2/56)  ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (1)ను రషీద్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ 110/4తో తడబడింది. ఈ దశలో లాథమ్‌‌‌‌‌‌‌‌, ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 144 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి జట్టును ఆదుకున్నారు. 48వ ఓవర్లో నవీన్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ (2/48) ఈ ఇద్దరినీ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చగా.. చివర్లో మార్క్‌‌‌‌‌‌‌‌ చాప్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 25 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుపులతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. 

అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ ఏ దశలోనూ బ్లాక్‌‌‌‌‌‌‌‌క్యాప్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు పోటీ ఇవ్వలేకపోయింది. 34.4 ఓవర్లలో 139 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై చిత్తుగా ఓడింది. రహ్మత్‌‌‌‌‌‌‌‌ షా (36), అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌ (27) మాత్రమే కాసేపు పోరాడారు. ఓపెనర్లు గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ (11), ఇబ్రహీం జద్రాన్‌‌‌‌‌‌‌‌ (14) పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలోనే పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరగా... కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హష్మతుల్లా షాహిది (8) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే ఔటయ్యాడు. శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (3/39), లోకీ ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ (3/19) దెబ్బకు లోయర్‌‌‌‌‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ పేకమేడలా కూలింది. మొహమ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ (7), రషీద్ ఖాన్‌‌‌‌‌‌‌‌ (8), ముజీబ్‌‌‌‌‌‌‌‌ (4), నవీన్‌‌‌‌‌‌‌‌ (0), ఫరూఖీ (0) సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితం అయ్యారు. ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్​ రెండు, హెన్రీ, రాచిన్‌‌‌‌‌‌‌‌ ఒక్కో వికెట్‌‌‌‌‌‌‌‌ పడగొట్టారు. గ్లెన్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌: 50 ఓవర్లలో 288/6 (ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ 71, లాథమ్‌‌‌‌‌‌‌‌ 68, విలయ్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ 54, నవీన్‌‌‌‌‌‌‌‌ 2/48).

అఫ్గానిస్తాన్:  34.4 ఓవర్లలో 139 ఆలౌట్ (రహ్మత్‌‌‌‌‌‌‌‌ షా 36, ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌ 27, ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ 3/19, శాంట్నర్ 3/39).