న్యూఢిల్లీ: వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చిన అహ్మదాబాద్ పిచ్‌కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అయితే ఔట్ ఫీల్డ్ చాలా బాగుందని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తన నివేదికలో పేర్కొన్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, చెన్నై పిచ్‌లను కూడా ఐసీసీ యావరేజ్‌గానే పరిగణించింది.
అయితే ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ జరిగిన ముంబై వాంఖడే పిచ్‌కు ‘గుడ్’ రేటింగ్ లభించింది. రెండో సెమీస్ జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు యావరేజ్ అని నివేదిక రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఔట్ ఫీల్డ్‌కు మాత్రం ‘గుడ్ రేటింగ్’ ఇచ్చాడు.