దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మన దేశం నుంచి వెళ్లిన ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. అదీ సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి వెళ్లిన ముగ్గురు సీఎంలు ఒకే చోట కలిశారు. ఆ ముగ్గురు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.
Also Read :- ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్.. గుండెలకి హత్తుకుని సైఫ్ ఎమోషనల్
ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు 2025, జనవరి 22వ తేదీ ఉదయం ఒకే వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు. 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో భాగంగా ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలా కలిసినప్పుడు తీసిందే ఈ ఫొటో..