ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

     1972లో తొలిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. యూనైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రామ్​ ఆధ్వర్యంలో 1973, జూన్​ 5న మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జరిపింది. మానవ పర్యావరణం (ఒకే భూమి) అనే అంశంపై స్వీడన్ రాజధాని స్టాక్​హోమ్​లో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ఒకచోట చేర్చి భూమిని రక్షించే, పునరుద్ధరించే ప్రయత్నంలో వారిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. పర్యావరణ రక్షణ గురించి తెలియజేయడమే 

 ముఖ్యోద్దేశం. 

  •     2024 థీమ్​: భూమిని పునర్నిర్మించడం, ఎడారీకరణను తగ్గించి కరువు లేకుండా చేయడం.
  •     ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది. యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రాం దాని భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమాన్ని జరుపుతాయి. అత్యున్నతస్థాయి అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి, భూమిని కాపాడేందుకు ఏంచేయాలో చర్చిస్తారు. 
  •     2024 దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియాలో జరగనున్నాయి.