టెక్సాస్‌కు చెందిన రెయిన్ ఫారెస్ట్ పార్టనర్షిప్ అనే లాభాపేక్ష లేని పర్యావరణ సంస్థ 2017లో వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డేను ప్రతి సంవత్సరం జూన్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్(యూఎన్ఈసీ) కూడా ఆమోదించిది.
2024 థీమ్ : ద ఇయర్ ఆఫ్ యాక్షన్
- భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం
- పర్యావరణ సమతుల్యత, భూగోళాన్ని సంరక్షించడంలో వర్షారణ్యాలు పోషించే కీలక పాత్ర గురించి ప్రపంచ మానవాళికి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.
వర్షారణ్యాల ప్రాముఖ్యత
- వర్షారణ్యాలు భూమికి ఊపరితిత్తులు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి కార్బన్ డై ఆక్సైడ్‌ను శోషించుకుని గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తాయి.
- వర్షారణ్యాలు ప్రపంచంలోని 50 శాతం మొక్కలు, జంతు జాతులను కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళికి అవసరమైన వనరులను అందిస్తున్నాయి.
- ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో 30 శాతం శోషించడం ద్వారా భూవాతావరణాన్ని నియంత్రించడంలో వర్షారణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి.