
ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అవతార్(డిజిటల్ మహిళా ప్రతినిధి లేదా మహిళా దౌత్యవేత్త)ను ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసింది. ఈ ఏఐ అవతార్‌కు విక్టోరియా షీ అని పేరు పెట్టారు. ఇది మనిషి(దౌత్యవేత్త) లాగా అధికారిక ప్రభుత్వ ప్రకటనలను చేతులు, తలను కదుపుతూ రాస్తుంది. చదువుతుంది.
ఉక్రెయిన్ సింగర్, టీవీ సెలబ్రిటీ రోజలి నొంబ్రే వాయిస్‌ను ఈ అవతార్‌కు అందించారు. అంతేకాకుండా డీప్ ఫేక్ వంటి టెక్నాలజీలోతలెత్తే సమస్యల మాదిరిగా కాకుండా విక్టోరియా చేసే ప్రతీ ప్రకటనలో ఎదురయ్యే సాంకేతిక లోపాలను ఎదుర్కోవడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లోని అధికార టెక్స్ట్‌కు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అమర్చారు. దీని ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారిక ప్రభుత్వ ప్రకటనలను చదువుతుంది. రాస్తుంది.
ఈ ఏఐ ఆధారిత డిప్లొమాట్ ప్రపంచంలో ఆయా దేశాల విదేశాంగ విధానంలో ఒక నూతన మార్పును తీసుకురానుంది.
ఖగోళ పరిశోధక నౌకలు
గ్రహం/ ఉపగ్రహం/ తోకచుక్క ప్రయోగించింది ఉపగ్రహ నౌకలు
అంగారకుడు ఇస్రో మంగళయాన్
అంగారకుడు నాసా మార్స్ ఒడిస్సీ, స్పిరిట్,
ఆపర్చునిటీ, ఫ్రీనిక్స్,
మావెన్ క్యూరియాసిటీ
అంగారకుడు ఈఎస్ఏ మాక్స్ ఎక్స్‌ప్రెస్, బీగిల్
బుదుడు నాసా మెసెంజర్
శుక్రుడు ఈఎస్ఏ వీనస్ ఎక్స్‌ప్రెస్
గురుడు నాసా గెలీలియో
శని నాసా కేసిని
టైటాన్ ఈఎస్ఏ హ్యూగెన్స్
యూరేనస్ రష్యా వాయేజర్–2
వైల్-2 తోకచుక్క నాసా స్టార్‌డస్ట్
టెంపుల్-1 తోకచుక్క నాసా డీప్ ఇంపాక్ట్
ప్లూటో నాసా న్యూహూరైజన్స్
హేలి తోకచుక్క నాసా గయాటో