ప్రభుత్వం నిర్వహించే సమావేశాలు సచివాలయాల్లోనో.. పార్లమెంట్ భవనాల్లో.. ఆ దేశానికి చెందిన ప్రధాన కార్యాలయాల్లోనో.. జరుగుతాయి. ఏకంగా ఓ దేశం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం సముద్రం మధ్యలో జరిగింది. ప్రభుత్వ అధికారులు.. మంత్రులు అందరూ 30 నిమిషాలు నీటిలో ఉండిపోయారు. ఇంతకూ ఏదేశానికి చెందిన మంత్రులు నీటిలో కూర్చున్నారు.. ఆదేశం పేరేమిటో తెలుసుకుందాం. .. .
మాల్దీవుల్లో సముద్రం కింద 2019లో కేబినెట్ సమావేశం జరిగింది. మాల్దీవుల్లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి కేవలం ఒక మీటరు ఎత్తులో ఉంటుంది. 2100 సంవత్సరం నాటికి ఈ దేశం సముద్రంలో మునిగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా కొంత భాగం సముద్రపు నీటిలో కలిసిపోతోంది. అధిక ఉష్ణోగ్రతల విషయంలో, మంచు కరగడం వల్ల సంక్షోభం పెరుగుతుంది. ఈ సంక్షోభం గురించి ప్రపంచాన్ని హెచ్చరించడానికి, అక్కడి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19, 2009న, మాల్దీవుల ప్రభుత్వం మొత్తం నీటి అడుగున సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం 30 నిమిషాల పాటు కొనసాగింది.
సముద్రానికి 15 అడుగుల దిగువన క్యాబినెట్ సమావేశం
అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో 11 మంది మంత్రులు, క్యాబినెట్ కార్యదర్శులు పాల్గొన్నారు. 15 అడుగుల లోతులో ఈ సమావేశం జరగడంతో మంత్రులంతా డైవ్ చేసి సముద్రంలో దిగారు. ప్రమాదకరమైన వాయువుల ఉద్గారాలను తగ్గించాలని ప్రపంచంలోని అన్ని దేశాలు డిమాండ్ చేసిన పత్రంపై అందరూ సంతకం చేశారు. అప్పట్లో వైరల్‌గా మారిన వీడియోల్లో నేతలంతా బ్లాక్ డైవింగ్ సూట్లు, మాస్క్‌లు ధరించారు.
2. In 2009, Maldivian President Mohamed Nasheed held the world's first ever underwater cabinet meeting as a gesture for help over rising sea levels.
— Divine Science? (@divinesciencesX) January 7, 2024
11 ministers signed this document and their wetsuits were auctioned to raise money for coral reef protection. pic.twitter.com/Ew9jpDBCLa
మంత్రులందరూ డైవర్లతో వెళ్లారు
సమావేశంలో అధికారులు.. మంత్రులు కూర్చొనేందుకు సముద్రం మధ్యలోనే బల్లలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి సహా మంత్రులందరి చుట్టూ చేపలు కూడా ఈదుతూ కనిపించాయి. నీటి అడుగున చేతులతో సైగలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు. వాటర్‌ప్రూఫ్ బోర్డులను ఉపయోగించి తీర్మానాలు రాసుకొని సంతకాలు చేశారు.