సాంకేతిక రంగంలో ఏఐ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలనే విన్నాం.. కానీ ఫస్ట్ టైం ఏఐ ద్వారా తయారు చేసిన భామలకు మధ్య అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఏఐ సృష్టించిన భామల మధ్య అందాల పోటీలు కూడా జరగబోతున్నాయని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ వెల్లడించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. మిస్ AI అందాల పోటీలు జరగడం ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం.
మిస్ ఏఐ పోటీలో నెగ్గిన విజేతకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నారు. ఏఐ క్రియేటెడ్ డివైస్ అందంతో పాటు వీటి తయారీకి ఉపయోగించిన టెక్నాలజీ, సోషల్ మీడియాలో వీటి ప్రభావం తదితర అంశాలన్నీ విజేత ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఈ పోటీల కోసం ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మే 10న విజేతలను ప్రకటించనున్నారు. మరో వింత ఏంటంటే AI అందాల పోటీల్లో నలుగురు జెడ్జి ప్యానెల్ లో ఇద్దరు ఏఐతో క్రియేట్ చేసిన డివైజ్ లే. AI పోటీ విజేతను మే 10న ప్రకటిస్తారు. ఏప్రిల్ నెల ఆఖరులో AI అందాల పోటీ అవార్డుల వేడుక ఆన్‌లైన్ లో జరగనున్నాయి.