గాలి,నీరు జీవితానికి ఎంత అవసరమో..ఆహారం కూడా అంతే ముఖ్యం. మనం తినే ఆహారం మన సమగ్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రోజూ తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుంది. మనకు తెలియకుండా తినే కొన్ని రకాల ఫుడ్..మన శరీరానికి హానీ కలిగిస్తాయని మీకు తెలుసా. మన శరీరానికి హాని కలిగించే ఏడు ఆహార పదార్థాలు ఇవే..
చక్కెర..
చక్కెర ఆరోగ్యానికి హానికరం..కానీ మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాలలో కలిపి తీసుకుంటాం. అధిక చక్కెర వినియోగం ఆరోగ్యానికి డేంజర్. మంచి బ్యాక్టీరియా మన పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చక్కెరను తినడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీని వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది.
పాలకూర..
ఫుడ్ పాయిజనింగ్ కు అధికంగా కారణమయ్యే ఆహార పదార్థాలపై సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ లోని శాస్త్రవేత్తలు 12 ఏండ్లుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారు షాకింగ్ న్యూస్ తెలియజేశారు. మనుషుల్లో ఫుడ్ పాయిజనింగ్ కు ముఖ్యకారణం పాలకూర. అందుకే ఈ కూరను తినేముందు..బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు,ఇతర బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.
గుడ్లు..
గుడ్డు తినడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అవ్వొచ్చు. గుడ్డుపై కోడి విసర్జన చేసిన తర్వాత దాన్ని సరైన విధంగా శుభ్రంగా కడుక్కొకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వారు..ఈ ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
చికెన్
పచికోడి మాంసం నుంచి కారే రక్తపు చుక్కలో క్యాంపిలోబాక్టర్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా జ్వరం, జీర్ణశయాంతర రుగ్మతలకు కారణమవుతుంది. మాంసాన్ని కడిగే సమయంలో ఈ బ్యాక్టీరియా మాంసంలోనే ఉండిపోతే ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఆరోగ్యం కాపాడుకోవడానికి పచ్చి చికెన్ కడిగే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ చికెన్ కట్ చేసిన తర్వాత కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రపర్చాలి.
ట్యూనా చేప..
చేపలను డీఫ్రాస్ట్ చేసి సరిగా నిల్వ చేయనప్పుడు స్కాంబ్రోటాక్సిన్ అనే టాక్సిక్ ప్రోటీన్ ఏర్పడుతుంది. ఇది చర్మపు దద్దుర్లు, వాంతులు, కడుపునొప్పి, అతిసారం, అధిక హృదయ స్పందన రేటు, కంటిచూపును కూడా కోల్పోయేలా చేసే ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుంది.
చీజ్..
చీజ్లో ఎలాంటి విషపూరిత రసాయనాలు ఉండవు. కానీ దాని ఉత్పత్తి సమయంలో కల్తీ అయితే అది విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి సమయంలో జబ్బు పడిన జంతువులు లేకుండా పాశ్చరైజ్ చేయని పాలను ఉపయోగించడం వల్ల బ్రూసెల్లోసిస్ , లిస్టెరియోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
తరిగిన మాంసం..
తరిగిన మాంసంలో యాంటీ మైక్రోబయల్ ఔషధాల అవశేషాలు, ఇకోలి, సాల్మోనెల్లా, లిస్టెరియా వంటి బ్యాక్టీరియాలను కనుగొన్నారు.