
యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, అనలిటిక్స్ సంస్థ గ్యాలప్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు –2025ను విడుదల చేసింది. ఈ రిపోర్టు 2012 నుంచి ప్రతిఏటా విడుదల అవుతుంది.
ఈ 11 అంశాల ఆధారంగానే ఆనందాన్ని నిర్ణయిస్తారు :
1. ఆయా దేశాల్లోని జనం ఎంత ఆరోగ్యంగా ఉన్నారు.
2. ఆయా దేశాల్లోని జనం దగ్గర ఉన్న ఆస్తులు ఏంటీ.. ఎంత సంపాదిస్తున్నారు.
3. ప్రతి ఏటా ఆయా కుటుంబాల్లో వృద్ధి కనిపిస్తుందా లేదా..
4. ఆయా దేశాల్లోని దాతృత్వం అంటే సేవా గుణం ఎలా ఉంది
5. దేశంలో అవినీతి ఎలా ఉంది.. ఏ స్థాయిలో ఉంది. అవినీతిపై జనం పడుతున్న ఇబ్బందులు.
6. మనుషుల మధ్య విశ్వాసం.. నమ్మకం ఎలా ఉంది.
7. వ్యవస్థలు, వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి.. ఆర్థికంగా, సామాజికంగా, పని ప్రదేశాల్లో ఇలా..
8. మనషుల్లో ఆత్మ సంతృప్తి ఏ స్థాయిలో ఉంది.. తమ జీవితాలపై హాయిగా ఉన్నారా లేదా..
9. కష్ట సమయాల్లో లేదా ఇతర అత్యవసర సమయాల్లో సామాజికంగా.. సమాజం నుంచి వచ్చే మద్దతు
10. ఆయా దేశాల్లో మనుషుల ఆయుర్థాయం.. జీవిత కాలం ఎంత.. మెరుగుపడిందా.. లేదా..
11. స్వేచ్ఛ.. ఆయా దేశాల్లోని వ్యవస్థల్లోనే కాకుండా వ్యక్తులకు ఉన్న స్వేచ్ఛ ఏంటీ
ఈ 11 అంశాల ఆధారంగా ఆ దేశం ఎంత హ్యాపీ.. ఆనందంగా ఉంది అనేది లెక్కిస్తారు. ఈ డేటా ప్రకారం..
ఆనందకరమైన టాప్ 1 0 దేశాలు:
1. ఫిన్లాండ్, 2. డెన్మార్క్, 3. ఐస్ లాండ్, 4. స్వీడన్, 5. నెదర్లాండ్స్, 6. కోస్టారికా, 7. నార్వే, 8. ఇజ్రాయెల్, 9. లక్సెంబర్గ్, 10. మెక్సికో.
అట్టడుగు స్థాయిలో నిలిచిన దేశాలు:
143 జింబాబ్వే, 144 మలావి, 145 లెబనాన్, 146 సియోర్రా లియోన్, 147 ఆఫ్గనిస్తాన్.
2025లో భారత్ 118వ స్థానంలో నిలిస్తే, 2024లో 126వ స్థానంలో నిలిచింది. భారత్ పొరుగున ఉన్న దేశాలు చైనా 68, పాకిస్తాన్ 109 స్థానాల్లో ఉన్నాయి.