దేశంలో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయుష్మాన్ భారత్.. ప్రపంచంలోనే అతి పెద్ద స్కీమ్ అని, ఇది ప్రతి భారతీయునిడి గర్వించేలా చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరూ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ ట్వీట్ పెట్టారు. ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
In the last 8 years, the medical education sector has undergone rapid transformations. Several new medical colleges have come up. Our Government’s efforts to enable study of medicine in local languages will give wings to the aspirations of countless youngsters.
— Narendra Modi (@narendramodi) April 7, 2022
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని మోడీ చెప్పారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ స్కీమ్ అయిన ఆయుష్మాన్ భారత్ అమలు.. దేశంలోని ప్రతి పౌరుడికీ గర్వకారణమని చెప్పారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా మంచి వైద్యం చేయించుకునేలా దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. గత 8 ఏళ్లలో వైద్య విద్యా రంగం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా అనేక మెడికల్ కాలేజీలు వచ్చాయని, స్థానిక భాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తేవడం ద్వారా భారీ సంఖ్యలో యువతను వైద్య రంగం వైపు మళ్లించవచ్చని ప్రధాని మోడీ పేర్కొన్నారు.