Health Alert : ఇవి తింటే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి

Health Alert : ఇవి తింటే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి

 World Kidney Day 2024: ఇటీవల కాలంలో మూత్రపిండాల(కిడ్నీ) సమస్యలు పెరిగాయి. తరుచుగా కిడ్నీలో రాళ్లు వచ్చాయి..కిడ్నీలు పాడయ్యాయి..కిడ్నీలుపూర్తిగా తొలగించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇలా అనేక కిడ్నీలకు సంబంధించిన సమస్యలను గురించి మనం వింటున్నాం..ఇలాంటి సందర్భాల్లో చాలామందిలో కిడ్నీల్లో సమస్యలు, వాటికి చికిత్స, కీడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏంచేయాలి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. కిడ్నీ, సమస్యలు, చికిత్స విషయం డాక్టర్లు చూసుకుంటారు.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఏవి తీసుకుంటే బాగుంటుందో..  కిడ్నీలను సేఫ్ గా ఉంచే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.. 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం..

ఆకుకూరలు

ఆకుకూరలు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూర, కాలే, కాలర్డ్ గ్రీన్స్ వంటి ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్, అంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పోటాషియం, ఫాస్పరస్ తక్కువగా ఉండటంతో కిడ్నీల ఆరోగ్యానికి ఇవి మంచి ఆహారం. సలాడ్స్, సూప్స్, వేపుడుగా తింటే మంచి పోషకాలను అందిస్తాయి. 

బెర్రీస్ 

స్టాబెర్రీ,బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీలలో సి విటమిన్ సహా అన్ని విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు.. బర్నింగ్ ప్లాబ్లమ్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తాజా బెర్రీలు చిరుతిండిగా తినొచ్చు లేదా  పెరుగులో జోడించి తీనడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. 

ఫిష్ 

సాల్మన్, మాకెరల్, ట్రాట్ వంటి ఫ్యాటీ ఫిష్ లలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. క్రమం తప్పకుండా ఒమెగా 3 అధికంగా ఉండే చేపలను తినడం వల్ల వాపు తగ్గుతుంది. కిడ్నీ వ్యాధి నుంచి కాపాడుతాయి. ఇవి కిడ్నీలకు మేలు చేస్తాయి. కనీసం వారానికి రెండు స్లారు ఈ చేపలను తినడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. 

తృణధాన్యాలు 

బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ , హోల్ వీట్ వంటి తృణధాన్యాలలో  ఫైబర్, మెగ్నిషియం , సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. శుద్ధి చేసిన ధాన్యాలతో పోలిస్తే వీటిలో భాస్వారం తక్కువ ఉంటుంది. ఇవి మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తాయి. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో సహాయ పడతాయి. 

గుడ్డులోని తెల్లసొన 

కిడ్నీ వ్యాధిలో బాధపడే వారికి గుడ్డులోని తెల్లసోన మంచి ఆహారం. గుడ్డులోని తెల్లసొనలో హై క్వాలిటీ ప్రోటీన్లు, తక్కువ పాస్పరస్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలు ఉన్నవారికి అత్యుత్తమైన ఫుడ్. కండరాల ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి ఆహారంలో గుడ్డులోని తెల్ల సొనను చేర్చుకోవడం ద్వారా మూత్ర పిండాల పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. 


కిడ్నీలకు మేలు చేసే ఈ ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవడంతోపాటు పుష్కలంగా నీరు త్రాగటం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండటం , సోడియం , పొటాషియం, భాస్వరం లెవల్స్ పరిశీలించుకోవడం చాలా అవసరం.