వారసత్వ సంపదను కాపాడుకోవాలి : ప్రొ. పాండురంగారావు

వారసత్వ సంపదను కాపాడుకోవాలి : ప్రొ. పాండురంగారావు
  • రామప్ప ఆలయంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే 

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ లో వారసత్వ సంపదను కాపాడుకోవాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు పేర్కొన్నారు.  సేవా టూరిజం కల్చర్ సొసైటీ ఫౌండర్ సూర్య కిరణ్ తో కలిసి ఆయన  శుక్రవారం వరల్డ్ హెరిటేజ్ డే ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యాటకులకు అవగాహన కల్పించారు. రామప్పను యునెస్కో గుర్తింపు పొందేలా.. భావితరాలకు ఒక గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఎంతో కృషి చేశామని ప్రొఫెసర్ పాండురంగారావు పేర్కొన్నారు. 

రామప్ప నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కోల్ మైన్స్ చేపట్టడం ద్వారా టెంపుల్, సరస్సుకు ముప్పు వాటిల్లుతుం దని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.  కోల్ మైన్స్ ద్వారా కొన్నేండ్ల తర్వాత భూమి పొరల్లో కదలికలు వచ్చి టెంపుల్ కూలిపోయే చాన్స్ ఉందని తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సిబ్బంది, పూజారు లు, ఇంటాక్ మెంబర్ దేవ ప్రతాప్, మాజీ నీటిపారుదల శాఖ చైర్మన్ ప్రకాశ్ రావు, రామప్ప పరిరక్షణ సమితి అధ్యక్షుడు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.