ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన

జమ్ముకశ్మీర్​లోని చీనాబ్​ నదిపై  నిర్మించిన బ్రిడ్జిపై అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్​ నుంచి రియాసికి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. కశ్మీర్​లోని భారత్​లోని బాగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉద్ధంపూర్​ – శ్రీనగర్​ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్​ వంతెన నిర్మించారు. 

చీనాబ్​ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇందులో భాగంగా టన్నెళ్లు కూడా నిర్మించారు. ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్​ నదిపై ఉన్న 275 మీటర్ల పొడవైన షుబాయ్​ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్​లోని ప్రఖ్యాత ఐఫిల్​ టవర్​తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ వంతెన ప్రపంచంలో ఎనిమిదో వింతగా నిలువనున్నది.