బైక్​ ర్యాలీతో కిడ్నీ వ్యాధులపై అవగాహన

బైక్​ ర్యాలీతో కిడ్నీ వ్యాధులపై అవగాహన

మాదాపూర్, వెలుగు: వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హార్లే డేవిడ్‌‌ సన్ బైకర్స్ ఆదివారం హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

నియోపోలీస్ మూవీ టవర్స్, మోకిల నుంచి తిరిగి హాస్పిటల్ కు చేరింది. మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్, మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ పాల్గొన్నారు.