
ప్రపంచ శాంతి కోసం నానాజాతి సమితి కంటే శక్తిమంతమైన నూతన అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడానికి లండన్‌లో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల నేతలు సమావేశమయ్యారు. ఆ తర్వాత 1941, ఆగస్టు 14న అట్లాంటిక్ సముద్రంలోని ఒక యుద్ధనౌకపై బ్రిటన్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌లు సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఎనిమిది అంశాలతో కూడిన ఒక ప్రకటనపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఈ ప్రకటననే అట్లాంటిక్ ప్రకటన అని అంటారు. ఇది ఐక్యరాజ్య సమితి అవతరణలో తొలి మెట్టు.
శా న్‌ప్రాన్సిస్కో సమావేశంలో యూఎన్చార్టర్పై 50 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. 1945, అక్టోబర్ 15న పోలండ్ సంతకం చేసింది. మొత్తం యూఎన్ఓ వ్యవస్థాపక దేశాలు 50. ఆర్టికల్ 110 ప్రకారం 1945, అక్టోబర్ 24 నుంచి ఐక్యరాజ్య సమితి చార్టర్ అమలులోకి వచ్చింది.
యూఎన్ఓ లక్ష్యాలు
1. అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించడం.
2. వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ఐకమత్యాన్ని వృద్ధి చేయడం.
3. అన్ని దేశాలకు సమాన హక్కులు, స్వయం నిర్ణయాధికారాన్ని కలిగించడం.
4. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మానవ సమస్యలను అంతర్జాతీయ సహకారంతో పరిష్కరించడం.
5. మానవ హక్కులు, స్వాతంత్ర్యాలను గౌరవించడం.
6. దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం.
సభ్యత్వం
శాన్ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్‌పై సంతకాలు చేసిన 51 దేశాలు చార్టర్ సభ్యులుగా పేర్కొన్నారు. కాలక్రమంలో ఐక్యరాజ్య సమితి పట్ల విశ్వాసం కలిగి సభ్యత్వం పొందిన దేశాలన్ని సాధారణ సభ్యదేశాలుగా గుర్తించబడుతున్నాయి. సమితి చార్టర్ నాలుగో నిబంధన ప్రకారం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఆమోదించే శాంతికాముక దేశాలన్ని ఐక్యరాజ్యసమితి సభ్యత్వాన్ని పొందడానికి అర్హులు. భద్రతామండలి ఒక తీర్మానం ద్వారా కొత్త దేశానికి ఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఇవ్వొచ్చని సిఫారసు చేయగా, సర్వప్రతినిధి సభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినప్పుడు కొత్త దేశానికి సభ్యత్వం లభిస్తుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆశయాలకు విరుద్ధంగా నడిచే దేశాల సభ్యత్వాలను భద్రతా మండలి సిఫారసుతో రద్దు చేస్తారు.
నోట్
1. జెకోస్లోవేకియా వ్యవస్థాపక సభ్య దేశం. కానీ 1992లో చెక్‌రిపబ్లిక్, స్లోవేకియాగా విడిపోయింది. ఈ రెండు దేశాలు 1993లో మళ్లీ సభ్యత్వాన్ని పొందాయి.
2. యుగోస్లోవియా వ్యవస్థాపక సభ్య దేశం. 1992లో బోస్నినా, హెర్జిగోవినా, క్రొయేషియా, స్లోవేనియా, పూర్వ యూగోస్లోవియా రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లోవియాగా విడిపోయాయి.
3. 2003లో ఫెడరిక్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా పేరు సెర్బియా, మాంటినీగ్రోగా మార్చారు. 2006లో దీని నుంచి విడిపోయి సెర్బియా దేశంగా ఏర్పడింది.
ఐక్యరాజ్యసమితి అంగాలు
సాధారణ సభ: సాధారణ సభను ఐక్యరాజ్య సమితి పార్లమెంట్‌గా పేర్కొంటారు. ప్రపంచ పార్లమెంట్ అని కూడా అంటారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ప్రతి సభ్య దేశం సాధారణ సభకు ఐదుగురు సభ్యులను పంపవచ్చు. అయితే, దేశానికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. సాధారణంగా దీని వార్షిక సమావేశాలు సెప్టెంబర్‌లో జరుగుతాయి. అయితే, భద్రతామండలి కోరిక మేరకు సెక్రటరీ జనరల్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుత ప్రెసిడెంట్; Csaba Korosi
భద్రతా మండలి
ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగము భద్రతామండలి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ప్రారంభ సభ్య దేశాల సంఖ్య 11. ఇందులో ఐదు శాశ్వత, ఆరు తాత్కాలిక సభ్యదేశాలుగా ఉన్నాయి. 1965లో సవరణ తర్వాత ప్రస్తుత సభ్య దేశాలు 15. ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి.
శాశ్వత సభ్యదేశాలు :
చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశాలకు ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని అధికరణ 27 ప్రకారం వీటో అధికారంఉంది. ప్రపంచంలోని ప్రధాన అంశాలపైన నిర్ణయం తీసుకునేందుకు అన్ని శాశ్వత సభ్యదేశాల అంగీకారం అవసరం. ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. శాశ్వత సభ్యదేశాలకున్న ఈ అధికారాన్నే వీటో అధికారం అంటారు. ఏ దేశమైనా సమావేశానికి హాజరుకాకపోతే వీటో పరిధిలోకి రాదు.
తాత్కాలిక సభ్య దేశాలు:
తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ రెండు సంవత్సరాలకు ఒక్కసారి 2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతారు.
ఆర్థిక, సాంఘిక మండలి
ఐక్యరాజ్య సమితి చార్టర్ ద్వారా 1945లో ఆర్థిక, సాంఘిక మండలిని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలను సమన్వయం చేసే ప్రధాన అంగం. ఆర్థిక, సాంఘిక మండలి సభ్యులను మూడు సంవత్సరాల పదవీకాలానికి సాధారణ సభ ఎన్నుకొంటుంది. వారిలో 1/3 వంతు మంది సభ్యులు ప్రతి సంవత్సరం పదవీ విరమణ చెందుతారు. ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 54.
ధర్మకర్తృత్వ మండలి
నానాజాతి సమితికి చెందిన మాండేట్ సిస్టమ్‌కు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి చార్టర్ ద్వారా ట్రస్టీషిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టీ షిప్ ద్వారా సిస్టమ్ ద్వారా 1945లో ధర్మకర్తృత్వ మండలి ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
ఈ మండలిలో మూడు రకాల సభ్యులుంటారు.
అంతర్జాతీయ న్యాయస్థానం
అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్యసమితిలోని న్యాయసంబంధమైన విభాగం. దీనిని ప్రపంచ కోర్టు అని అంటారు. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రకటించిన యూఎన్ చార్టర్ ప్రకారం 1945, జూన్ 26న స్థాపించబడింది. కానీ 1946, ఏప్రిల్‌లో పనిచేయడం ప్రారంభమైంది. సాధారణ సభ, భద్రతామండలి ద్వారా ఎన్నుకోబడిన 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ కాలం 9 సంవత్సరాలు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉంది. ఈ సంస్థ కార్యకలాపాలు 1976, ఏప్రిల్ 18న ప్రారంభమయ్యాయి. అధికార భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్. ఐక్యరాజ్య సమితి ఆరు అంగాల్లో న్యూయార్క్ వెలుపల ఉన్న ఒకే ఒక అంగం.
వాషింగ్టన్ ప్రకటన
1942, జనవరి నెలలో 26 మిత్ర రాజ్యాల ప్రతినిధులు వాషింగ్టన్లో సమావేశమై ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా అట్లాంటిక్ చార్టర్ నియమాలను గుర్తించారు.
మాస్కో ప్రకటన
1943, అక్టోబర్ నెలలో అమెరికా, సోవియట్ యూనియన్, ఇంగ్లండ్‌కు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అన్ని దేశాల ప్రాతినిధ్యంతో సాధారణ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
డంబర్టన్ ఓక్స్ సమావేశం
1944లో వాషింగ్టన్‌లోని డంబర్టన్ ఓక్స్‌లో అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు ప్రణాళిక గురించి చర్చించారు. ఇందుకోసం బ్లూ ప్రింట్ తయారు చేశా రు.
యాల్టా సమావేశం
1945, ఫిబ్రవరిలో సోవియట్ యూనియన్‌లోని యాల్టాలో రూజ్వెల్ట్, చర్చిల్, స్టాలిన్లు సమావేశమై వీటో సూత్రం, యూఎన్ చార్టర్ రూపొందించారు.