ప్రపంచ సింహాల దినోత్సవం.. సింహాల సంఖ్యపై మోదీ ట్విట్

 ప్రపంచ సింహాల దినోత్సవం.. సింహాల సంఖ్యపై మోదీ ట్విట్

ఆగస్టు 10న 'ప్రపంచ సింహాల దినోత్సవం' సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజును ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. "గత కొన్ని సంవత్సరాలుగా ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉన్నందుకు భారతదేశం గర్విస్తోంది" అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. కొన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

‘‘ప్ర‌పంచ సింహ‌ల దినోత్సవం.. వాటి శక్తి, గాంభీర్యంతో మన హృదయాలను దోచుకునే గంభీరమైన సింహాలను జరుపుకునే సందర్భం. భారతదేశం ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉన్నందుకు గర్విస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోంది. సింహాల ఆవాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. మనం వాటిని రక్షిస్తూ.. రాబోయే తరాలకు అందుబాటులో ఉండేలా చూడాలి. అవి అభివృద్ధి చెందుతూనే ఉండాలి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ లో రాసుకువచ్చారు.

ప్రపంచ సింహాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగష్టు 10 న జరుపుకుంటారు. వారి జనాభా క్షీణించడం, పరిరక్షణ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్ ఈ రోజును నిర్వహిస్తోంది. ఈ రోజును గంభీరమైన ఆ జంతువుకు అంకితం చేస్తూ, వాటి గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని జరుపుతోంది. ఇటీవలి కాలంలో భారతదేశం సింహాల జనాభా క్షీణతను విజయవంతంగా తిప్పికొట్టింది. కొన్ని సంవత్సరాల నుంచి సింహాల జనాభా క్రమంగా పెరుగుతూ వస్తోంది .