ప్రపంచ వ్యాప్తంగా ఇండియా ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతోంది. మన సామప్రదాయం, కట్టుబాట్లకు చాలా మంది విదేశీయులు ఆకర్షితులు అవుతున్నారు. అంతే కాకుండా సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల లాంటి వాళ్లు దేశాన్ని శాసించే కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు సీఈఓలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా భారత్ లో పర్యటించిన ప్రముఖులు అడపాదడపా మన దేశ ఔన్నత్యం గురించి ప్రశంసిస్తూనే ఉంటారు. తాజాగా జపాన్ కి చెందిన టెక్ జపాన్ సంస్థ సీఈఓ నిశియామా కూడా ఇండియాను ప్రశంసించారు.
ఇటీవలే జపాన్ నుండి బెంగళూరుకు షిఫ్ట్ అయిన నిశియామా తన నెలరోజుల అనుభవాన్ని పంచుకుంటూ " నా లైఫ్ లో ఇది గొప్ప అధ్యాయం" అని అన్నారు. ఇప్పుడు ప్రపంచానికి ఇండియా నాయకత్వం అవసరమని అన్నారు. ఇండియాలో ఉన్న భిన్నత్వం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఇంత పెద్ద దేశంలో ఇన్ని మతాలు, జాతులు, సంప్రదాయాలు కలిసి ఉండటం అద్భుతం అని అభిప్రాయపడ్డారు.
కలెక్టివ్ ఎఫర్ట్స్ విషయంలో ఇండియా ప్రపంచ దేశాలకు ఆదర్శం అని అన్నారు నిశియామా. లీడర్షిప్ విషయంలో, క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో ఇండియన్స్ సమర్ధులని, మరో పక్క జపనీస్ డీలిజెంట్ లీడర్షిప్ లో, హార్డ్ వర్క్ చేయటంలో సమర్థులని, ఇరు దేశాలు కొలాబరేషన్ తో ముందుకెళ్తే గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.