స్వైటెక్‌‌‌‌‌‌‌‌కు షాక్‌‌‌‌‌‌‌‌..సెమీస్‌‌‌‌‌‌‌‌లో పెగులా, సినర్‌‌‌‌‌‌‌‌, డ్రాపర్‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌ : యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ సంచలనం నమోదైంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌ (పోలెండ్‌‌‌‌‌‌‌‌).. క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జెసికా పెగులా (అమెరికా) 6-2, 6-4తో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ స్వైటెక్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చి తొలిసారి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లింది. గంటా 28 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పోలెండ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఒక్క ఏస్‌‌‌‌‌‌‌‌ కూడా కొట్టలేకపోయింది. 

రెండు డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు మూడు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఒకే ఒక్కదాన్ని కాచుకుంది. 41 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌తో మూల్యం చెల్లించుకుంది. తన సర్వీస్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక పాయింట్లు సాధించిన పెగులా ఒక డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌‌‌‌‌, 22 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు నాలుగు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు కాచుకుని విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. 

ఇద్దరూ చెరో 12 విన్నర్లు సాధించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ జానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ (ఇటలీ) 6-2, 1-6, 6-1, 6-4తో డేనియల్‌‌‌‌‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)పై గెలిచాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జాక్‌‌‌‌‌‌‌‌ డ్రాపర్‌‌‌‌‌‌‌‌ (బ్రిటన్‌‌‌‌‌‌‌‌) 6-3, 7-5, 6-2 డి మినార్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు.