ప్రపంచ నెంబర్ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రోజు తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల తన మనసు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందన్న బార్టీ.. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నానని తెలిపింది. అన్ని రకాలుగా సంతోషాన్ని అందించిన ఆటకు ఎప్పటికీ రుణపడి ఉంటానని.. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది. ఇక, 25 ఏళ్ల యాష్లే బార్టీ కెరీర్ విషయానికొస్తే.. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచి కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ సాధించింది. అంతేగాక.. ఈ విక్టరీతో 44 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో మహిళా ప్లేయర్(ఆస్ట్రేలియన్)గా బార్టీ రికార్డు సృష్టించింది.
మరిన్ని వార్తల కోసం: