
ముంబై : గాయం నుంచి కోలుకొని, ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో చేరాడు. ఆదివారం ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. శుక్రవారం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న సూర్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లు కొడుతూ కనిపించాడు. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. ఢిల్లీపై గెలిచి విజయాల ఖాతా తెరవాలని చూస్తోంది. సూర్య తుది జట్టులోకి వస్తే ముంబై బ్యాటింగ్ బలం పెరగనుంది.