ఇటలీ టెన్నిస్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 3 నెలల నిషేధం

ఇటలీ టెన్నిస్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 3 నెలల నిషేధం

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరల్డ్ నంబర్ వన్, ఇటలీ టెన్నిస్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానిక్ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) మూడు నెలల నిషేధం విధించింది. ఏడాది కిందట రెండుసార్లు డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులో పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తేలిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అతనిపై కనీసం ఏడాది వేటు వేయాలని వాడా అనుకుంది. కానీ, దీనిపై  సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ)లో అప్పీల్ చేశాడు. 

తాను ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాల్పడలేదని, చేతి వేలు తెగడంతో ట్రైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సూచన మేరకే క్లాస్టెబోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే నిషేధిత డ్రగ్‌ తీసుకున్నానని సినర్ తెలిపాడు. సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదనపై ఏకీభవించిన ఐటీఐఏ అతనిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఐటీఐఏ నిర్ణయాన్ని కోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో సవాల్ చేసిన వాడా చివరకు సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా మూడు నెలల నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సినర్ కూడా అంగీకారం తెలిపాడు. ఈ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఫ్రెంచ్ ఓపెన్‌‌కు ముందు సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మే 7 నుంచి జరిగే ఇటాలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తిరిగి బరిలోకి దిగనున్నాడు.