- వనపర్తిలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం
వనపర్తి టౌన్, వెలుగు: మనసులో మెదిలే భావాలను కళాత్మకంగా వర్ణించడమే కవిత్వం అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం వనపర్తిలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. సాహిత్యం సమాజహితాన్ని కోరుతుందన్నారు. మనసుకు హత్తుకునేలా కవిత్వం చెప్పిన వారు కొందరైతే, పదునైన పదాలతో సమాజాన్ని చైతన్యపరచిన వారు మరి కొందరన్నారు.
కవి సమ్మేళనంలో దాదాపు 25 మంది కవులు కవితా గానం చేశారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కవులు పగడాల వెంకటయ్య, జనజ్వాల, బైరోజు చంద్ర శేఖర్, శివరాజ లింగం,సందాపురం బుచ్చయ్య, బాలస్వామి, సత్తార్, నాగరాజు, డి.కృష్ణయ్య, శ్రీనివాస్,డా.బి.శ్యాం సుందర్, కంటె నిరంజనయ్య,ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.