మీకు కోడింగ్ లో దమ్ముంటే.. కోటీశ్వరులను చేస్తా : ఎలన్ మస్క్ ఓపెన్ ఆఫర్

వరల్డ్ లోనే మోస్ట్ రిచెస్ట్ లో పర్సన్స్ లో ఒకరైన ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో కొత్తకొత్త బిజినెస్ ఐడియాస్, సలహాలు, సూచనలు వంటివాటి గురించి నెటిజన్లతో చర్చిస్తూ ఉంటాడు. అయితే తన కంపెనీలో ఉద్యోగాల విషయంలో ఎలాన్ మస్క్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇందులో "మీరు హార్డ్‌కోర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే మరియు ఎవ్రీథింగ్ యాప్‌ను నిర్మించాలనుకుంటే, దయచేసి మీ ఉత్తమ పనిని code@x.com కు పంపడం ద్వారా మాతో చేరండి. మీరు ఎక్కడ చదువుకున్నారో, అసలు చదువుకున్నారో లేదో,  అలాగే ఏ "పెద్ద పేరున్న" కంపెనీలో పనిచేశారో కూడా మాకు అవసరం లేదు. జస్ట్ మీరు రాసిన కోడ్ ని మాకు చూపించండి" అని పేర్కొన్నాడు. 

ALSO READ | పొటీ పరీక్షల ప్రత్యేకం.. కమ్యూనిస్ట్​ ఉద్యమం

దీంతో నెటిజన్లు ఈ ట్వీట్ కి పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు తాము డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కోడ్ ని స్క్రీన్ షార్ట్స్ తీసి ఎలన్ మస్క్ ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు. అయితే రానున్న కాలంలో ఉద్యోగాల సెలెక్షన్స్ లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని, అలాగే సెర్టిఫికెట్స్, మెరిట్స్, వంటివాటితో పనిలేకుండా స్కిల్స్ మాత్రమే చూస్తారని కాబట్టి యువత ర్యాంక్స్ పై కాకుండా స్కిల్స్ పెంచుకోవడంపై శ్రద్ధ చూపిస్తే మంచిందని కొందరు నిపుణులు అంటున్నారు. మరి ఇంకెందుకు లేటు.. మీకు కూడా సాఫ్ట్వేర్ కోడింగ్ లో పట్టు ఉంటె మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి.