పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 2005లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన వాటర్ ఫర్ లైఫ్ డికేడ్ నేపథ్యంలో భూమిపై ఉన్న నీటి వనరులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
19వ ప్రపంచ నదుల దినోత్సవం థీమ్: వాటర్ వేస్ ఆఫ్ లైఫ్
నదులను పరిరక్షంచాలన్న లక్ష్యంతో 2005లో ప్రపంచ నదీ దినోత్సవం ప్రారంభించారు.
6న ఈయూ ఇండియా వాటర్ ఫోరమ్
సెప్టెంబర్ 18న న్యూఢిల్లీలో ఆరో ఈయూ ఇండియా వాటర్ ఫోరమ్ సదస్సు జరిగింది. ఇందులో భారత్, యూరోపియన్ యూనియన్ స్థిరమైన నీటి నిర్వహణలో సహకారం పెంపొందించుకోవడానికి అంగీకరించాయి. నదీ పరీవాహక నిర్వహణ, ప్రోత్సాహక ఆవిష్కరణలు, సాంకేతికత బదిలీలో సహకారానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇండియా, ఈయూ వాటర్ పార్టనర్షిప్(ఐఈడబ్ల్యూపీ) నీటి నిర్వహణలో సాంకేతిక, శాస్త్రీయ, విధాన ఫ్రేమ్‌వర్క్‌లను మెరుగుపరచడమే లక్ష్యంగా 2016లో ఏర్పాటైంది.
నదీ పరీవాహక నిర్వహణ, వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, నీటి పాలన అంశాల్లో పరిష్కారాలను రూపొందించడంపై ఐఈడబ్ల్యూ దృష్టి సారిస్తుంది. ఈయూ, భారతదేశం తపి, గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నదీ నిర్వహణపై సహకరిస్తున్నాయి.