ప్రపంచంలోనే ఫస్ట్ AI సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. రాస్తుంది..కోడింగ్..వెబ్ క్రియేట్ చేస్తుంది

ప్రపంచంలోనే ఫస్ట్ AI సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. రాస్తుంది..కోడింగ్..వెబ్ క్రియేట్ చేస్తుంది

టెక్ దిగ్గజం కాగ్నిషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి  AI సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పరిచయం చేసింది. ఇది వెబ్ సైట్ల రూపకల్పన, సాఫ్ట్ వేర్లను కోడింగ్ చేయగలదు. డెవిన్ అని దీనికి పేరు పెట్టారు. ఇది మానవ ఇంజనీర్ల పనిని సులభతరంచేయడానికి రూపొందించారు.. మానవ ఇంజనీర్లకు బదులుగా ఉద్దేశించబడలేదని కంపెనీ పేర్కొంది. ప్రముఖ AI కంపెనీల ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలో డెవిన్ సక్సెస్ అయ్యాడు. 

ఈ కొత్త AI  సాధనం చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది. ఒకే ప్రాంప్ట్ తో కోడ్ రాస్తుంది. వెబ్ సైట్ లను , సాఫ్ట్ వేర్లను తయారు చేస్తుంది. టెక్ కంపెనీ కాగ్నిషన్ రూపొందిం చిన ఈ AI సాఫ్ట్ వేర్ ఇంజనీరు డెవిన్..అడిగే ప్రతి దాన్ని చాలా చక్కగా చేస్తుంది. డేవిన్లో ప్రత్యేకత ఏంటంటే.. షార్ప్ గా ఆలోచించడం, సంక్లష్టమైన పనులను ప్లాన్ చేయడంలో అద్భుతమై ప్రతిభను చూపుతుంది. ఇది ఒకేసారి వేలాది నిర్ణయాలు తీసుకోగలదు.SWE బెంచ్ కోడింగ్ బెంచ్ మార్క్  ఆధారంగా సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ పనులను చక్కగా చేస్తుంది. 

AI టెక్నాలజీలో డెవిన్ ప్రధాన పురోగతిని సూచిస్తుంది. రోటీన్ టాస్క్ లను ఆటోమేట్ చేయడం, క్లిష్టమైన సమస్యలపై దృష్టి సారించేందుకు ఇంజనీర్లకు సాయం చేస్తుంది. సాఫ్ట్ వేర్ డెవెలప్ మెంట్ లో కొత్త ఆవిష్కరణల శకానికి మార్గం సుగమం చేస్తుంది.