
బ్రేక్ ఫాస్ట్ ఇష్టం లేదా డోంట్ వర్రీ రెండు సమోసాలు తిని.. ఓ ఛాయ్ తాగితే బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్.. మధ్యాహ్నం భోజనం తినాలనే మూడ్ లేదా ఓ రెండు సమోసా.. సాయంత్రం స్నాక్స్ అంటే సమోసా.. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా సమోసా అనేది అందరికీ ఇష్టం. ఫంక్షన్స్ అయినా సమోసా మస్ట్ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైంది సమోసా.. సమోసా.. ఇప్పుడెందుకు సమోసా గోల అనుకుంటున్నారా.. సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే మాత్రమే కాదు.. ప్రపంచ సమోసా దినోత్సవం కూడా...
ప్రపంచ సమోసా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ స్నాక్స్ ను పిండి, నీటితో తయారు చేస్తారు. వీటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, ఇతర సుగంధ ద్రవ్యాల పూర్ణంతో నింపుతారు. ఆ తర్వాత వాటిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించి తయారు చేస్తారు.
ALSO READ : ఈ వర్షాల టైంలో.. వర్క్ ఫ్రమ్ హోం బెటర్ : నెటిజన్ల డిమాండ్
సమోసాలు మధ్యప్రాచ్యంలో ఉద్భవించాయని చాలా మంది నమ్ముతారు. ఇది బహుశా 10వ శతాబ్దం నాటిది అయి ఉండొచ్చిన చెబుతుంటారు. 13వ లేదా 14వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన కొందరు వ్యాపారులు దీన్ని పరిచయం చేశారు. ఇది స్థానికుల హృదయాలను ఎంతో ఆకట్టుకుంది. సమోసాలు చాలా దేశాల్లో ప్రసిద్ధ స్నాక్ ఫుడ్ గా పేరు గడించాయి. స్ట్రీట్ ఫుడ్ గానూ ఇది విశేషంగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా భారతదేశంలో వీటిని ప్రధాన కోర్సుగా కూడా తినవచ్చు. ఈ రోజున ప్రపంచ సమోసా దినోత్సవం సందర్భంగా ప్రయత్నించాల్సిన 5 వంటకాలేంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ సమోసా
ఇది ఒక క్లాసిక్ సమోసా వంటకం. దీన్ని చికెన్, ఉల్లిపాయలు, బఠానీలు, మసాలాలతో తయారు చేస్తారు. ఈ ఫిల్లింగ్ ను పిండి, నీరు కలిపి తయారు చేసి పెట్టుకున్న చపాతీలో చుట్టి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
బంగాళదుంప సమోసా
ఇది బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, మసాలాలతో తయారు చేయబడిన మరొక ప్రసిద్ధ సమోసా వంటకం. దీన్ని కూడా సమోసా గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
వెజిటేబుల్ సమోసా
ఇది క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వంటి వివిధ రకాల కూరగాయలతో తయారు చేయబడిన శాకాహార సమోసా వంటకం. ఈ ఫిల్లింగ్ ను పిండిలో నింపి, ఆ తర్వాత సన్నని మంటపై బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
దాల్ సమోసా
ఇది కాయధాన్యాలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులతో తయారు చేయబడిన పప్పు సమోసా వంటకం.
పాలక్ సమోసా
ఇది పాలకూర, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారవుతుంది. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చేసుకుని.. ఆ తర్వాత ఈ ఫిల్లింగ్ ను చుట్టి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.