WTC 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఖరారు..ఎప్పుడు, ఎక్కడంటే..?

WTC 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఖరారు..ఎప్పుడు, ఎక్కడంటే..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారైంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. వచ్చే ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ మంగళవారం (సెప్టెంబర్ 3) ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. 

ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. " ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం త్వరగా ఎదురు చూస్తున్నాం. 2025 ఎడిషన్ కోసం తేదీలను ప్రకటించినందుకు మేము సంతోషంగా ఉంది". అని ఐసీసీ సిఇఒ జియోఫ్ అల్లార్డిస్ ఒక ప్రకటనలో తెలిపారు. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్  విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనున్నాయి. న్యూజిలాండ్ (3), ఇంగ్లండ్ (4), శ్రీలంక (5), దక్షిణాఫ్రికా (6), బంగ్లాదేశ్ (7) టాప్ 2 లో చోటు సంపాదించాలని ధీమాగా ఉంది.