ప్రపంచ యుద్ధం తప్పదా: ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న దేశాలు ఇవే: ఇప్పుడు రష్యా ఏం చేయబోతుంది..?

ప్రపంచ యుద్ధం తప్పదా: ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న దేశాలు ఇవే: ఇప్పుడు రష్యా ఏం చేయబోతుంది..?

అమెరికాలో వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ.. మినరల్స్ డీల్ సందర్భంగా వైట్ హౌస్ లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాగ్వాదానికి దిగాడు. ఉక్రెయిన్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేది లేదని అమెరికా ముఖానే చెప్పేశాడు. ఈ క్రమంలోనే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటూ ట్రంప్ హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గని జెలెన్ స్కీ.. అమెరికా నుంచి వెనక్కి వచ్చేశారు.

 ఈ పరిణామాలతో అమెరికా వైఖరిని ఎండగడుతూ.. ఉక్రెయిన్ దేశానికి మద్దతుగా.. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 30 దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అన్నీ జెలన్ స్కీ తీరును సమర్ధిస్తూ.. ఆయా దేశాల అధినేతలు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు. 

ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న దేశాలు : 

 ఫ్రాన్స్,  స్వీడన్, పోలాండ్, స్పెయిన్, లిథూనియా, రిపబ్లిక్ ఆఫ్ లాట్ వియా,  చెక్ రిపబ్లిక్,  నార్వే, జర్మనీ, పోర్చుగల్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్, కమిషన్ లోని సభ్య దేశాలు లక్సెంబర్గ్,  నెదర్లాండ్స్, ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా,  ఫిన్లాండ్, క్రొయేషియా, డెన్మార్క్, రొమేనియా, ఆస్ట్రియా,  కెనడా, రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా, న్యూజిలాండ్ దేశాలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. 

మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్ తో ప్రపంచ దేశాలు అన్నీ ఇప్పుడు ఆ దిశగానే ఆలోచనలో పడ్డాయి. అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీరును ఎత్తిచూపిన రష్యా.. దూకుడు ప్రదర్శిస్తుంది. ఉక్రెయిన్ దేశం దూకుడు చూశారు కదా.. వాడిని అమెరికాలోనే కొట్టాలి అంటూ రష్యా సైన్యాధికారి కామెంట్ చేయటం చూస్తుంటే.. రష్యా ఎంత కసిగా ఉందో అర్థం అవుతుంది. 

యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఇక ఒంటరి పోరాటం చేయొచ్చు.. దీనికి అమెరికా మద్దతు లేకపోయినా యూరోపియన్ యూనియన్ దేశాలు ముందుకు వస్తుండటంతో.. రష్యా సైతం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు అని స్పష్టం అవుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యా ముమ్మరం చేస్తే.. అప్పుడు ఉక్రెయిన్ కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ దేశాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్లే.