
గ్రహాలు.. రాశులు.. మొదలగు వాటిని లెక్కలేస్తున్న పండితులు పహల్గామ్ ఉగ్రదాడి .. తరువాత జరగబోయే పరిస్థితుల గురించి వివరిస్తున్నారు. జూన్ ... .జులై నెలల్లో పిశాచ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతుతున్నారు. దీని వలన ఎలాంటి అనర్ధాలు జరుగుతాయని చెబుతున్నారో తెలుసుకుందాం. .
వచ్చేస్తుంది.. వచ్చేస్తుంది.. భారత యుద్దం అంటూ మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. ఈ యుద్ధం జరగాలే కానీ మానవాళి వినాశనం ఖాయం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. గతంలో జరిగిన విధ్వంసాలు.. ఉద్రిక్త పరిస్థితులు అంచనా వేస్తున్న జ్యోతిష్య నిపుణులు ఈ ఏడాది జూన్.. జులైలో భారీ విధ్వంసం జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.
పహల్గాం దాడి తరువాత భారత.. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్.. నేవీ .. దళాలు బోర్డర్ లో ఆయుధాలతో గస్తీ చేస్తున్నాయి. 2025.. జూన్.. జులై నెలల్లో పిశాచ యోగం.. నాగసర్పదోషం .. ఏర్పడుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి యోగంలో భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందంటున్నారు పండితులు..
ప్రపంచ వ్యాప్తంగా గతంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులను ఒకసారి గమనించినట్లయితే 9/11 అమెరికాదాడులు.. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయిల్దాడులు జరిగిన సమయంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పిశాచ యోగమే ఉందట.. ఆసమయంలో కేతువు.. కుజుడితో కలిస్తే అంతా విధ్వంసకర వాతావరణమే ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. కొన్ని దుష్టశక్తులు మానవులను ప్రేరేపింపజేసి హేయమైన చర్యలు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తాయట.. అంతేకాదు మానవాళిపై దాడులు కూడా జరగుతాయని పండితులు చెబుతున్నారు.
9/11 అమెరికాదాడులు.. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయిల్దాడులు జరిగిన సమయంలో కేతువు.. బుధుడు కలిసి ఉండటమే కాకుండా.. గురుడు ఛండాలయోగాన్ని కలుగ జేశాడని.. అంటే ఎవరైన మంచివారు.. చెడువారితో కలిసినప్పడు.. చెడు వారు బలంగా ఉన్నప్పుడు మంచివారు కూడా వారికి తానా తందానా అంటారు. అలాగే గురుడు మంచి బుద్దితో ఉన్నా.. రాహు గ్రహంతో కలిసినప్పుడు రాహువు బలంగా ఉండి గురుఛండాల యోగం ఏర్పడుతుంది.
ఇజ్రాయిల్ దాడులు 2023 అక్టోబర్ 7న జరిగిన సమయంలో చంద్రుడు మీనరాశిలో ఉండి.. శని ..శుక్రుడిని వక్ర దుష్టితో చూశాడని .. అందుకే దాడులు జరిగాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు . మరల అదే పరిస్థితి 2025 జూన్.. జులైలో సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.
2025 జూన్.. జులై నెలలో పిశాచయోగం ఏర్పడనుంది. అంటే కేతువు.. కుజుడు కలిస్తే విధ్వంసం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గురువు నక్షత్రం ఆరుద్ర.. రాహువు నక్షత్రం పూర్వాబాధ్ర... ఈ రెండు వక్ర దృష్టితో ఉన్నాయని.. రాహువు .. గురువు యొక్క 9 వ ఇంటిలోకి ప్రవేశిస్తే భారీ విధ్వంసకర ఘటనలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడు ..శని మిథునరాశిలో...శుక్రుడు వృషభరాశిలో ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులే జరుగుతాయి. సూర్యుని (రవి) నక్షత్రం పుష్యమి.. శని.. యముడి నక్షత్రం కూడా పుష్యమి .. ఈ నక్షత్రం శని దేవతకు అధిపతి.. అందుకు సూర్యుడు.. శని కలిస్తే ప్రభుత్వానికి శోకం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. జులై 24.. 2025 న రెండు పాపగ్రహాలు రాహువు.. కేతువు రెండూ పక్కపక్కనే ఉండటం వలన భారీ విధ్వంసం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు అంటే 1974 ఆగస్టు 15 న మిథున లగ్నంలో బుధుడు.. కుజుడు కలిసి వక్ర దృష్టితో ఉన్నారని.. గురుడు.. బుధుడు ..చంద్రుడు.. కేతువు కలిసి పాప యోగాన్ని కలిగి ఉన్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.