నీరు లేకపోతే మనుగడే లేదు : జె.శశిధర్

నీరు లేకపోతే మనుగడే లేదు : జె.శశిధర్

సూర్యాపేట, వెలుగు : నీరు లేకపోతే మానవ మనుగడే లేదని, ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రముఖ న్యాయవాది, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ గౌరవ సలహాదారుడు జె.శశిధర్ సూచించారు. ప్రపంచ జలసంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సూర్యాపేటలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందిస్తూ ఇంకుడుగుంతల ఏర్పాటు, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి గోడలపై స్టిక్కర్స్ అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని, అందరూ పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇండ్లలో ఇంకుడు గుంతలు ఏర్పరుచుకోవాలని చెప్పారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఓడిసి పట్టి భూమిలో నీరు ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, సభ్యులు వందనపు శ్రీదేవి, మాడిశెట్టి శ్రీనివాస్, సోమ హేమమాలిని, దారం శ్రీనివాస్, దేవరశెట్టి నాగరాజు, కొక్కుల సంపత్, బంగారు పద్మ పాల్గొన్నారు.