బాగ్ లింగంపల్లిలో ఘనంగా వరల్డ్ వాటర్ డే

బాగ్ లింగంపల్లిలో ఘనంగా వరల్డ్ వాటర్ డే

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఎన్ఎస్ఎస్, ఎన్​సీసీ, మార్పు సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరల్డ్ వాటర్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ ఎలా చేసుకోవాలి.. ఎలా వాడుకోవాలో విద్యార్థులకు వివరించారు. అనంతరం నీటి సంరక్షణ విధానాలపై విద్యార్థులు చేపట్టిన ర్యాలీని వాటర్ వర్క్స్ సెక్షన్ మేనేజర్ జీవన్ జ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీధర్, కుమారస్వామి, సప్న హజారే, స్వప్న అశోక్ తో పాటు అంబేద్కర్ విద్యాసంస్థల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మెహిదీపట్నం: నీటిని పొదుపుగా వాడుకుంటేనే మన భవిష్యత్తు తరాలకు నీటిని అందించగలుగుతామని నీటి సంరక్షణ ప్రతినిధి దొరబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం లంగర్ హౌస్ కాళిదాసుపుర లలితా నగర్ లోని ఏర్పాటు చేసిన నీటి సంరక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నీటిని వృథా చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.