వరల్డ్స్ ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌

వరల్డ్స్ ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌

గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను తయారుచేసిన ఆర్మీ మేజర్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌ను తయారుచేశారు. స్నిపర్ బుల్లెట్లను అడ్డుకోగల ఈ హెల్మెట్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌గా రికార్డయింది. ఈ హెల్మెట్ AK-47 బుల్లెట్లను కూడా ఆపగలదు. అంతేకాకుండా 10 మీటర్ల దూరం నుంచి వచ్చిన బుల్లెట్‌ను కూడా ఈ హెల్మెట్ అడ్డుకోగలదు.

ఈ హెల్మెట్‌ను మేజర్ అనూప్ మిశ్రా.. ప్రాజెక్ట్ అభేద్యా పథకం కింద తయారుచేశారు. అనూప్ గతంలో స్నిపర్ బుల్లెట్లను కూడా తట్టుకోగల ఫుల్ బాడీ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను తయారు చేశాడు.

ప్రస్తతం అనూప్ ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్‌‌లో పనిచేస్తున్నాడు. అనూప్ గతంలో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ వేసుకున్నా కూడా శత్రువుల బుల్లెట్లకు గాయపడ్డాడు. దాంతో ఫుల్ బాడీ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్.. ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి గన్ షాట్ లొకేటర్‌ని కూడా అభివృద్ధి చేసింది. దీని సాయంతో 400 మీటర్ల దూరంలోని బుల్లెట్‌ను కూడా గుర్తించవచ్చు. దాంతో ఉగ్రవాదులను వేగంగా గుర్తించి వారిని అడ్డుకోవచ్చు. ఈ లొకేటర్ భారతదేశపు మొట్టమొదటి గన్ షాట్ లొకేటర్.

For More News..

అత్యాచారాలపై పాక్ సంచలన నిర్ణయం

రాత్రికి రాత్రే 16ఏళ్ల యువతి దారుణ హత్య.. తమ్ముడిపైనే అనుమానం

కరోనా వైరస్‌కు టీకా? ఇండియన్‌  సైంటిస్ట్ ముందడుగు