లేహ్ (లడఖ్): ప్రపంచంలోనే మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ (ఎత్తైన ప్రాంతం) పారా స్పోర్ట్స్ సెంటర్ లడఖ్‌లోని లేహ్‌లో ఏర్పాటు కానుంది. ఇది 2028 పారాలింపిక్స్‌కు సన్నద్ధం అయ్యే ఇండియా పారా అథ్లెట్లను తీర్చిద్దనుంది.
ఈ సెంటర్ ఏర్పాటు కోసం లేహ్‌లోని లడఖ్ అటానామస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ), హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎమ్‌ఎఫ్) ఎంఓయూపై సంతకాలు చేశాయి. పారా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, వింటర్ గేమ్స్ సహా మొత్తం 29 స్పోర్ట్స్‌కు కోచింగ్ ఇచ్చేలా ఈ సెంటర్‌ను రూపొందిస్తారు.