ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్​ ఇదే

ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్​ ఇదే

ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్​ క్లాక్​(అణు గడియారం)ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ స్టాండర్డ్స్​ అండ్​ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్​ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది. అధికారికంగా అంతర్జాతీయ సమయాన్ని చెప్పే ప్రస్తుతం అటామిక్​ గడియారాల కంటే ఈ న్యూక్లియర్​ గడియారం మరింత కచ్చితత్వంతో సమయాన్ని చెబుతుంది.

భవిష్యత్తులో అటామిక్​ గడియారాలను న్యూక్లియర్​గడియారాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీపీఎస్​ వ్యవస్థలు మరింత కచ్చితత్వంతో పనిచేయడానికి, ఇంటర్నెట్​ వేగం పెరగడానికి డిజిటల్​ సమాచార వ్యవస్థల భద్రతకు, శాస్త్ర పరిశోధనలకు ఈ గడియారం కీలకంగా మారనున్నది .