
అరుదైన, అద్భుతమైన ఇల్లు..ప్రపంచంలోనే సిమెంట్ లేకుండా కట్టిన మొట్టమొదటి ఇల్లు ఇది.వెయ్యేండ్లు చెక్కు చెదరకుండా ఓనర్ ఏరికోరి కట్టుకున్న అద్భుతమైన భవనం. అధిక స్థిరత్వం, జీరో కార్బన్ సిగ్నిఫికెన్సీ కోసం ఇప్పుడు ఇంటి నిర్మాణ పద్దతులకు పూర్తి విరుద్ధంగా రూపొందించబడిన అసాధారణ గృహం. బెంగళూరులో సిమెంట్ లేకుండా నిర్మించిన ఓ ప్రత్యేకమైన, అందమైన ఇల్లుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన యూట్యూబర్ ప్రియమ్ సరస్వత్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఇప్పుడది ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ అరుదైన అద్భుతమైన కట్టడం గురించి ఇంటి ఓనర్, వాస్తుశిల్పిని ఇంటర్వ్యూ చేసిన యూట్యూబర్ ఈ భవనం స్పెషాలిటి గురించి వివరిస్తూ.. భవనం అందాలను వీడియోలో చూపించాడు.
ఎలా నిర్మించారంటే..
ఈ ఇల్లు ప్రపంచంలోనే మొట్టమొదటి జీరో-సిమెంట్ రాతి ఇల్లు అని, ఎక్కువ కాలం పటిష్టంగా ఉండేలా నికర-జీరో కార్బన్ లక్ష్యంగా రూపొందించబడిందని యజమాని చెప్పారు. అంటే ఇది కేవలం రాళ్లు ఉపయోగించి కట్టిన ఇల్లు.. ఇందులో బూడిద రంగు గ్రానైట్, ఇసుకరాయితో సహా ఇతర రాళ్లు మాత్రమే ఇంటి నిర్మాణంలో ఉపయోగించారు. ఇప్పుడు నిర్మాణ పద్దతులకు పూర్తి భిన్నంగా సిమెంట్ లేకుండా నిర్మించారు. వెయ్యేళ్ల పటిష్టతను లక్ష్యంగా ఈ ఇంటిని నిర్మించినట్లు ఓనర్ చెబుతున్నారు.
నెట్టింట లైకులే లైకులు..వేల సంఖ్యలో షేరింగ్స్
ఈ ఇల్లుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను చూశారు. అద్భుతం, ప్రాచీన కాలంలో ఇలాంటి వాస్తుశిల్పం వినియోగించారు. ఇది ఆధునిక పునరుజ్జీవంలా అనిపిస్తుంది అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
అద్భుతంగా ఉంది కానీ.. తీవ్రమైన సమ్మర్, వింటర్ సీజన్లను తట్టుకుంటుందా అని డౌట్ వ్యక్తం చేశారు. మరికొందరు రాయిని తవ్వడం ప్రకృతికి విరుద్ధం..దాని వల్ల నష్టాలు తప్పవు.. ఇలాంటివి ప్రోత్సహించడం మంచిదేనా అని ప్రశ్నించారు.
ఈ వీడియోను Xలో 8లక్షల మంది చూశారు. ఇన్ స్టాలో 4లక్షల 25వేల మంది నెటిజన్లు చూశారు. వేల సంఖ్యలో లైక్‌లు, రీషేర్‌లను పొందింది. అంతగా ఆకట్టుకుంది మరి.
ALSO READ | ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై కొరడా.. 2400 అకౌంట్ల నుంచి రూ.126 కోట్లు ఫ్రీజ్