![ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో..](https://static.v6velugu.com/uploads/2023/08/Worlds-Largest-Cargo-Plane-Landed-In-Hyderabad_kH7fTYLMQ9.jpg)
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ (బెలూగా) మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎయిర్ పోర్టు నిర్వహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా.. హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. ఎయిర్‌బస్ బెలూగా భారీ ఎయిర్ కార్గోను రవాణా చేయడానికి ప్రసిద్ధి చెందింది.
ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం బెలూగా సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు. విమానం బరువు 86 టన్నులపైగానే ఉంటుంది. బెలూగా కార్గో విమానం తొలిసారిగా 2022 డిసెంబర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. మళ్లీ ఆగస్టు 1, 2023న న వచ్చింది. 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్ అతిపెద్ద ఈ కార్గో విమానాన్ని తయారుచేసింది. అనేక మార్పులు చేస్తూ సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది.