ప్రపంచంలోనే అతిపెద్ద విమానం

ఎగిరింది బోయింగ్‌ 777-9ఎక్స్‌

వాషింగ్టన్‌లో చేసిన టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం సక్సెస్‌

అతి పొడవైన విమానం కూడా..

రేటు రూ. 3 వేల కోట్లు.. సీటింగ్‌ కెపాసిటీ 425

ఓ వైపు 737 మ్యాక్స్​ విమానాలపై వివాదం. వాటి తయారీ అటకెక్కింది. సంస్థను చిక్కుల్లో పడేసింది. ఆ చిక్కుల్లో కొంత ఊరట అన్నట్టు.. బోయింగ్​ సంస్థ ఓ మంచి విజయాన్ని చవి చూసింది.  ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పొడవైన రెండు ఇంజన్ల 777–9ఎక్స్‌ టెస్టింగ్‌ విజయవంతమైంది. వాషింగ్టన్‌లోని సియాటిల్‌ సిటీలో ఉన్న బోయింగ్‌ వైడ్‌ బాడీ ఫ్యాక్టరీ నుంచి శనివారం జరిగిన ఈ ప్రయోగం సక్సెసయింది. వాతావరణం సరిగా లేక పోయినావారంలో రెండు సార్లు ప్రయోగం వాయిదా పడినా ఎట్టకేలకు శనివారం వాతావరణం అనుకూలించడంతో ప్రయోగాన్ని బోయింగ్‌ పూర్తి చేసింది. 30 సెకన్లలో టేకాఫ్‌ అయిన విమానం 4 కిలోమీటర్ల ఎత్తులో మేఘాల్లో ఈజీగా విహరించింది. దీంతో ఒక్కసారిగా బోయింగ్‌ సిబ్బంది, ఉద్యోగుల చప్పట్లతో ప్రయోగం జరిగిన ప్లేస్‌ మార్మోగింది. 737 విమానాలు రెండు కూలి 300 మందికి పైగా చనిపోవడంతో ఈ మోడల్‌ ఉత్పత్తిని ఆపేశారు. దీంతో ప్రయోగదశలో ఉన్న 777 పూర్తవుతుందా లేదా అని అనుమానాలొచ్చాయి. కానీ ఎట్టకేలకు కొత్త విమానం ప్రయోగాన్ని బోయింగ్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. త్వరలోనే భద్రతకు సంబంధించిన పనులను పూర్తి చేసుకొని 2021 చివరి నాటికి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది. తొలుత లుఫ్తాంజాతో సర్వీసు మొదలయ్యే అవకాశం ఉంది.

పోటీ ఇస్తదా?

బోయింగ్‌ 777–9ఎక్స్ 425 మందిని మోసుకెళ్లగలదు. 14 వేల కిలోమీటర్లను కవర్‌ చేయగలదు. 76 మీటర్ల పొడవైన ఈ 777–9ఎక్స్‌ విమానం ఇప్పటివరకు తయారు చేసిన అతిపెద్ద కమర్షియల్‌ విమానం. ప్యాసింజర్‌ కెపాసిటీ పరంగా కూడా ఇదే పెద్దది.  క్యాబిన్‌ సౌండ్‌ తక్కువుండేలా డిజైన్‌ చేశారు. ఇంతకుముందున్న వేరియంట్‌ 777–300ఈఆర్‌ తో పోలిస్తే మరో 3 ఎకానమిక్‌ వరుస సీట్లు ఇందులో పెరిగాయి. దానితో పోలిస్తే 350 కిలోమీటర్లు ఎక్కువ దూరం వెళ్తుంది. మూడున్నర లక్షల కిలోల బరువును మోసుకెళ్లగలదు. ఈ విమానం రేటు జస్ట్‌ రూ. 3 వేల కోట్లు. బోయింగ్‌తో పోటీ పడే ఎయిర్‌బస్‌ ఏ 350 విమానం సైజు బోయింగ్‌ 777–300ఈఆర్‌ కన్నా చిన్నది. ఇప్పటికే ఎయిర్‌బస్‌ ఏ350, బోయింగ్‌ 787 విమానాలు మార్కెట్‌లో మంచి సక్సెస్‌ అయ్యాయి. ఈ విమానాల కోసం చాలా కంపెనీలు ఆర్డర్లు కూడా ఇచ్చాయి. మరి వీటిని దాటుకొని 777–9ఎక్స్‌ ముందుకెళ్తుందా అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

కరోనాపై ఎన్నెన్నో కథనాలు.. ఎన్నో పుకార్లు

ఇప్పుడు కండక్టర్‌.. రేపు కలెక్టర్‌..